టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యధిక చర్చనీయాంశంగా మారిన సినిమా ‘గాడ్ ఆఫ్ వార్’. తొలుత ఈ కథను అల్లు అర్జున్‌తో తెరకెక్కించాలని భావించిన త్రివిక్రమ్, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్‌కు వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కుమారస్వామికి సంబంధించిన పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో యుద్ధాధిపతిగా, దైవ స్వరూపంలో తారక్ కనిపించనున్నారని సమాచారం. ఇప్పటివరకు చూడని విజువల్ గ్రాండియర్‌తో సినిమా ఉంటుందని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa