హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఘన విజయం సాధించింది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మొదట మార్చి 27న విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'పెద్ది' సినిమా, షూటింగ్ పనులు పెండింగ్‌లో ఉండటంతో ఏప్రిల్ 30కి వాయిదా పడింది. బాబాయ్ కోసం అబ్బాయ్ తన సినిమాను వాయిదా వేయడం వల్ల మెగా అభిమానులకు వరుస నెలల్లో పండుగలా మారింది.ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాల నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ డిమాండ్ ఉంది. ఏరియాల వారీగా నిర్మాతలకు కళ్లు చెదిరే ఆఫర్లు ఇస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఉస్తాద్ నిర్మాతలు కొంతకాలం వేచి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa