బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌లో అసభ్యకరమైన పదజాలంతో కూడిన పాటలు పాడారన్న ఆరోపణలపై హైద్రబాద్లోని మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ అశోక్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.ఈ క్రమంలోనే జర్నలిస్టు అశోక్ వేములపల్లి కూడా చంద్రహాస్ పాటపై సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. ‘‘పొద్దున్నే నిద్రలేవగానే సోషల్ మీడియాలో ఈ బూతు పాట కనిపించింది ... సినిమా పబ్లిసిటీ కోసం అది కూడా నెగెటివ్ పబ్లిసిటీ కోసం వీళ్ళు చేస్తున్న అరాచకం చూడండి .. ఆ భాషని ఎంకరేజ్ చేద్దామా ? ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేద్దామా ? ఆలోచించండి..సర్వం మాయ అనే ఒక మంచి మలయాళ సినిమాని చూసిన కళ్ళతోనే ఈ దరిద్రపు తెలుగు పాటని చూడాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చంద్రహాస్‌పై, ఆ ఈవెంట్‌కు హాజరైనవారిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మరోవైపు తనపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై చంద్రహాస్ స్పందించారు. తాను స్టేజీ మీద ఆ పాట పాడినందుకు తనకెలాంటి బాధ లేదన్నారు. తాను ఎవరికీ సారీ చెప్పాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. ఆ పాట కోసం పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదని తెలిపారు. మూడున్నర నిమిషాల పాటలో 5 సెకన్స్ కట్ చేసి బూతు పురాణం అంటున్నారని అని అన్నారు. తాను చాలామందితో పనిచేశానని, అయితే ఎవరితోనూ తప్పుగా వ్యవహరించలేదని చంద్రహాస్ పేర్కొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa