ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ నటి జయవాహిని కన్నుమూత

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 11:37 AM

టాలీవుడ్ నటి జయవాహిని కన్నుమూత. ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్‌లో పలు కీలక పాత్రలు పోషించిన నటి జయవాహిని. ఆమె హైదరాబాద్ మణికొండలోని తన సొంత ఇంటిలోనే మృతి చెందినట్లు నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు.ఆమె గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి విషమించిన నేపథ్యంలో చికిత్స పొందుతూ జయ వాహిని ప్రాణాలు విడిచినట్లు కరాటే కళ్యాణి తెలిపారు. జయవాహిని డెడ్ బాడీని శ్రీకాకుళం జిల్లాలోని స్వస్థల గ్రామానికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ సాయంత్రం జయ వాహిని అంతక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.జయ వాహిని మృతి పట్ల టాలీవుడ్ సీనియర్ నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పద్మక్క.. నిన్ను కాపాడడానికి చాలా ప్రయత్నం చేశాం... కానీ నిన్ను బ్రతికించుకోలేకపోయామని చెప్పారు. నీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. జయ వాహినిని ముద్దుగా పద్మక్క అని పిలుస్తానని కరాటే కళ్యాణి చెప్పారు. ఇక అటు సినిమాలలో కీలక పాత్రలు పోషించిన నటి జయ వాహిని మరణించారనే వార్త‌లు రాగానే, సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa