ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' సినిమా గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ సినిమా ది రాజాసాబ్.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే అధికారికంగా జియో హాట్‌స్టార్ ప్రకటించింది.ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రభాస్ ఓల్డ్ గెటప్‌లో ఉన్న పలు సీన్స్‌ను కలుపుతున్నట్లు తెలిపింది. ట్రైలర్లలో ప్రభాస్ ఓల్డ్ గెటప్‌ను చూపించ మేకర్స్ సినిమాలో అది కనిపించకపోవడంతో చాలా మంది సినిమాని ఆస్వాదించలేకపోయారు. ఆ తర్వాత తక్కువ నిడివితో ఉన్న కొన్ని సీన్స్‌ను థియేటర్ రన్‌లో కలిపారు. ఇప్పుడు ఓటీటీ కోసం మరికొన్ని సన్నివేశాలు కలిపేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.'రాజాసాబ్' విషయానికొస్తే.. దేవనగర సంస్థాన ఒకప్పటి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్).. ప్రస్తుతం తన మనవడు రాజు(ప్రభాస్)తో చాలా సాధారణ జీవితం గడుపుతుంటుంది. వయసు కారణంగా ఈమెకు మతిమరుపు సమస్య ఉంటుంది. కానీ తన భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తన కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా తీసుకురమ్మని మనవడికి చెబుతుంది. కానీ కనకరాజు.. రాజుని నర్సాపుర్‌లోని రాజ మహల్‌కి రప్పించుకుంటాడు. మార్మిక విద్యలెన్నో తెలిసిన కనకరాజుని రాజు అలియాస్ రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? కనకరాజు గతమేమిటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa