ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 02:03 PM

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరో నవీన్ పొలిశెట్టి. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కుర్రాడు.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్నారు. మొదట్లో చిన్న చిన్న చిత్రాలతో అలరించిన నవీన్.. జాతిరత్నాలు సినిమాతో హిట్టు అందుకున్నాడు.ఈ సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ త్రవాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంతో అలరించాడు. ఇప్పుడు అనగనగా ఒక రాజు మూవీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ జోడిగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించగా.. మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ సైతం హైలెట్ అయ్యింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నవీన్ యాక్టింగ్ గురించి చెప్పక్క్రర్లేదు. ఎప్పటిలాగే తనదైన కామెడీ టైమింగ్, పంచులు, నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇదిలా ఉంటే.. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుందని ఆ ఓటీటీ సంస్థ పేర్కొంది. అయితే మొన్నటి వరకు నెట్టింట వినిపించిన రూమర్స్ కంటే ముందే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa