స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' విడుదలపై ఉత్కంఠ నెలకొంది. జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమాకు సీబీఎఫ్‌సీ అడ్డంకులు సృష్టించడంతో, చిత్రయూనిట్ మార్పులు చేసి, అన్ని నిబంధనలకు అనుగుణంగా సిద్ధం చేస్తోంది. త్వరలోనే సెన్సార్ క్లియరెన్స్ పొంది, ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఈ వివాదం కోర్టుకు వెళ్లగా, మొదట సింగిల్ బెంచ్ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించింది. అయితే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్, అన్ని వాదనలు పూర్తిగా వినాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కేసును తిరిగి సింగిల్ బెంచ్ విచారణకు పంపింది. ఈ పరిస్థితుల్లో సినిమా విడుదలపై కొత్త సమాచారం బయటకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa