మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’పై దర్శకుడు రాజమౌళి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా మొత్తం ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ఉండదని, కీలక సన్నివేశాలు మాత్రమే ట్రూ ఐమ్యాక్స్ (1.43)లో చిత్రీకరిస్తున్నామని జక్కన్న స్పష్టం చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో మొదటిసారి రూపొందుతున్న చిత్రమిది. దీన్ని గ్లోబల్ ఫిల్మ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు రాజమౌళి. అంతర్జాతీయ మార్కెట్‌ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆయన పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిచ్చారు. ఇందులో మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు. సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa