బాలీవుడ్ నటి షనయా కపూర్, తన లుక్స్, ఫేస్ కట్, శరీర సౌష్ఠవంపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను సానుకూలంగా తీసుకుంటానని, అయితే వ్యక్తిగత విమర్శలను మాత్రం తేలికగా తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు.కానీ, పనితో సంబంధం లేని విమర్శల విషయంలో షనయా వైఖరి మరోలా ఉంటుందట. "నా ముఖం ఎలా ఉంది? నేను ఎందుకు ఇంత సన్నగా ఉన్నాను? నా దవడ పెద్దదిగా ఉందా? వంటి వ్యక్తిగత కామెంట్లను నేను పూర్తిగా విస్మరిస్తాను" అని షనాయా కపూర్ తెలిపారు. తన తల్లి మహీప్ కపూర్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, ఆమెతోనే తన బాధలను పంచుకుంటానని షనయా తెలిపారు.ఇకపోతే షనయా కపూర్ తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం 'ఆంఖోన్ కీ గుస్తాఖియాన్' ద్వారా నటిగా పరిచయమయ్యారు. రస్కిన్ బాండ్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సేతో కలిసి ఆమె నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, షనాయా నటనకు మంచి మార్కులే పడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa