ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రణవీర్ సింగ్ మూడు కేరవాన్ల వివాదం: నిజం ఇదే!

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 07:32 PM

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్' చిత్రం రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. అయితే, సినిమా షూటింగ్ సమయంలో ఆయన మూడు కేరవాన్లు అడిగారని, నిర్మాతలను ఇబ్బంది పెట్టారని వచ్చిన వార్తలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో, చిత్ర నిర్మాణ బృందంలోని ఒక కీలక సభ్యుడు స్పందిస్తూ, షూటింగ్ సమయంలో కేవలం ఒక వానిటీ వ్యాన్ మాత్రమే ఉపయోగించారని, మిగిలినవి కార్లు మాత్రమేనని, రణవీర్ మూడు వానిటీ వ్యాన్లు అడగలేదని స్పష్టం చేశారు. దీంతో ఆయనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. మేకర్స్ రణవీర్ ను గొప్ప నటుడని, పని పట్ల అంకితభావంతో ఉంటారని ప్రశంసించారు.అలాగే సీక్వెల్‌ కోసం రణ్‌వీర్‌ సింగ్‌ రోజుకు 12-14 గంటల పాటు పనిచేశాడని.. దీని ఫలితంగా 15-25 కిలోల మేర బరువు తగ్గాడని పేర్కొన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa