ధన్య బాలకృష్ణ...నేను శైలజ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొత్త దర్శకులతో పనిచేయడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. వారిలోని స్పష్టమైన ఆలోచన, నిజాయితీ, అభిరుచి, అంకితభావమే వారిని నమ్మడానికి కారణమని ఆమె తెలిపారు. గతంలో కొన్ని సినిమాలు చెప్పినా కథకు, తెరపై చూపించిన దానికి తేడాలు ఉన్నప్పటికీ, తాను మోసపోయానని ఎప్పుడూ భావించలేదని అన్నారు. దర్శకుల కృషి తనను ఆకట్టుకుంటుందని అన్నారు. హిట్, ఫ్లాప్ అనేవి సహజమని, ఇండస్ట్రీ బంధాలు ముఖ్యమని తెలిపారు.విజయాలు, అపజయాలను సమానంగా స్వీకరించే మనస్తత్వం గురించి అడగగా, ప్రారంభంలో అపజయాలు తనను తీవ్రంగా నిరుత్సాహపరచాయని, రాత్రులు నిద్రపట్టేది కాదని ధన్య బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఒక సినిమా విడుదలైన తర్వాత అది ఆడకపోతే చాలా నిరాశపడేదానినని చెప్పారు. “సెకండ్ హ్యాండ్” అనే సినిమా తనకు చాలా ఆశలు కల్పించిందని, దానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారని తెలిపారు. మంచి కామెడీగా భావించినప్పటికీ, ఆ సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని, సుప్రసిద్ధ దర్శకులు, హీరోలతో పనిచేయాలనే తన కోరిక నెరవేరలేదని ఆమె వివరించారు. ఆ నిరాశ నుండి బయటపడటానికి ఆరు నుండి ఎనిమిది నెలలు పట్టిందని ధన్య బాలకృష్ణ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa