ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు తన ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి 'ఉస్తాద్ భగత్ సింగ్'గా ముస్తాబవుతున్నారు పవన్. పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం వచ్చే నెల 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్రానికి సంబంధించిన ప్రచార కంటెంట్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'దేఖ్ లేంగే సాలా' పాటకు మంచి స్పందన లభించింది. అయితే, శివరాత్రి కానుకగా విడుదల చేయాలనుకున్న రెండో పాట సోషల్ మీడియాలో లీక్ అయినట్లు తెలస్తోంది. ఈ పాట పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని, 'ఎత్తు ఎత్తు..కాలరే ఎత్తు' అంటూ సాగే ఈ పాట ఊర మాస్ బీట్‌తో ఉందని, డ్యాన్స్ అదరగొట్టేలా ఉందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa