ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 27న 'జియోహాట్ స్టార్' లో స్ట్రీమింగ్ కానున్న 'రోస్లిన్'

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 03:13 PM

ఓటీటీలలో మలయాళ థ్రిల్లర్ సిరీస్ లకు విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలాంటి వెబ్ సిరీస్ ఒకటి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆ సిరీస్ పేరే ' రోస్లిన్'. ఈ సిరీస్ కి వినాయక్ శశికాంత్ కథను అందించారు. సుమేశ్ నందకుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి, 'దృశ్యం' దర్శకుడు జీతూ జోసెఫ్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్నాడు. దాంతో ఈ సిరీస్ అనూహ్యమైన మలుపులతో పరుగులు పెడుతుందని ఆడియన్స్ భావిస్తున్నారు. మీనా .. వినీత్ .. బేబీ సంజన ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 27వ తేదీ నుంచి 'జియోహాట్ స్టార్' లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa