ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్లమ్మ చిత్రం కోసం నెలలో పది రోజులు పనిచేస్తాను

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 01:20 PM

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు.  ‘బలగం’ చిత్రంతో సంచలనం సృష్టించిన వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాతో ఆయన కథానాయకుడిగా పరిచయం కానున్నాడు. సంగీత దర్శకుడిగా అత్యంత బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం నెలలో కేవలం పది రోజులు మాత్రమే కేటాయించేలా నిర్మాత దిల్‌ రాజుతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఎస్పీ స్వయంగా వెల్లడించాడు.నిజానికి దేవిశ్రీని హీరోగా పరిచయం చేయాలని దర్శకుడు సుకుమార్ ఎప్పుడో ప్లాన్ చేశాడు. అయితే, తన తండ్రి మరణించడంతో ఆ ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేకపోయానని, అందుకే అది ఆగిపోయిందని డీఎస్పీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సుకుమార్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, నిర్మాత దిల్‌ రాజు వంటి వారు తనను ఎప్పటినుంచో నటన వైపు ప్రోత్సహించారని ఆయన గుర్తుచేసుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa