ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమ విషయంలో యువత సులభంగా నమ్మకం కోల్పోవద్దు

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 01:21 PM

‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్, ప్రేమ విషయంలో నేటి యువతకు ఓ ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ప్రేమను కాపాడుకోవాలంటే ఓపిక చాలా అవసరమని, దానిపై సులభంగా నమ్మకం కోల్పోవద్దని ఆమె సూచించారు. ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘దో దీవానే షెహర్ మే’ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. "ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రేమలో ఓపిక తగ్గిపోతోంది. అందుకే చాలామంది ఒకరినొకరు తేలిగ్గా వదులుకుంటున్నారు. మా సినిమాలో పాత్రల మాదిరిగా పాతకాలపు మనస్తత్వం ఉంటే బాగుంటుంది. చిన్న గొడవ వస్తే చాలు, వెంటనే ఒకరినొకరు బ్లాక్ చేసేస్తున్నారు. మా దారులు వేరు, మేం ఒకరికొకరం సెట్ కాము అని తేలిగ్గా చెప్పేసి సంబంధాలను వదులుకుంటున్నారు" అని అన్నారు."ప్రతి యువతీ యువకుడు ప్రేమను నమ్మాలని కోరుకుంటున్నాను. దయచేసి ప్రేమపై నమ్మకం వదులుకోవద్దు. అది చాలా అందమైన, అద్భుతమైన అనుభూతి. సరైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తే, జీవితం సులభంగా మారుతుంది. అందుకే సరైన వ్యక్తి కోసం ఓపికగా ఎదురుచూడండి. అంతేకానీ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు" అని యువతకు ఆమె సలహా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa