టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ మరణించి 12 ఏళ్లు గడుస్తున్నా, ఆయన వ్యక్తిగత జీవితంపై చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో ఉదయ్ నిశ్చితార్థం ఎందుకు రద్దయిందనే దానిపై అనేక ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలో, ఉదయ్ అక్క శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఉదయ్-సుస్మితల మనస్తత్వాలు కలవకపోవడం వల్లే పెళ్లిని రద్దు చేసుకున్నారని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. చిరంజీవి తమ కుటుంబానికి అండగా నిలిచారని, ఉదయ్‌కి గాడ్ ఫాదర్ లాంటి వారని ఆమె తెలిపారు. ఉదయ్ ఆత్మహత్యకు ఎవరినీ నిందించవద్దని, చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని ఆమె ఖరాకండిగా చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa