కేరళ నటి అనుపమ పరమేశ్వరన్, నటుడు ధ్రువ్ విక్రమ్ డేటింగ్ వార్తలతో మరోసారి వార్తల్లో నిలిచారు. 'బైసన్' సినిమాతో పరిచయమైన వీరిద్దరి మధ్య సంబంధంపై గతంలోనే ఊహాగానాలు వినిపించాయి. మలయాళ ఇండస్ట్రీ ద్వారా సినీరంగంలో అడుగుపెట్టారు అనుపమ పరమేశ్వరన్. అక్కడ స్టార్‌గా దూసుకుపోతున్న దశలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన అ ఆ చిత్రంతో తెలుగువారిని పలకరించారు అనుపమ పరమేశ్వరన్. లంగా ఓణీలో పదహారు అణాల తెలుగు అమ్మాయిలా ఆ సినిమాలో నటించి కుర్రాళ్ల కలల రాకుమారిగా మారింది. ఆ తర్వాత ప్రేమమ్, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హాలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు తదితర చిత్రాల్లో నటించింది. తాజాగా ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో ధ్రువ్‌తో తన రిలేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు అనుపమ పరమేశ్వరన్. ఇటీవల ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనుపమ- ధ్రువ్ విక్రమ్‌లు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారారు. ఇదే వేదికపై అనుపమకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ధ్రువ్. ఆ సమయంలో పక్కనే ఉన్న యాంకర్ ఓ ప్రశ్న వేసింది. మీరు అర్ధరాత్రి 2 గంటలకు ఎవరికైనా వీడియో కాల్ చేయాలంటే ఎవరికి చేస్తారని ప్రశ్నించింది. దానికి ఏమాత్రం తడబడకుండా ధ్రువ్‌కు కాల్ చేస్తానని అనుపమ ఆన్సర్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa