ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జియో హాట్ స్టార్'లో అందుబాటులో 'లక్కీ ది సూపర్ స్టార్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 03:51 PM

తమిళంలో రూపొందిన సినిమానే 'లక్కీ ది సూపర్ స్టార్'. జీవీ ప్రకాశ్ కుమార్ - అనశ్వర రాజన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి ఉదయ్ మహేశ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నేరుగా ఈ రోజునే 'జియో హాట్ స్టార్'లో విడుదలైంది. 'లక్కీ' అనే ఒక కుక్క పిల్ల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుందా .. లేదా? అనేది చూద్దాం.


లక్ష్మణ్ (జీవీ ప్రకాశ్ కుమార్) అక్కాబావలు శ్రీనివాసన్ - అనూ సిటీలో నివసిస్తూ ఉంటారు. వాళ్ల ఒక్కగానొక్క సంతానమే 'అమ్ములు'. ఆ పాప 'ఆటిజం'తో బాధపడుతూ ఉంటుంది. శ్రీనివాసన్ ఒక పెద్ద సంస్థలో పని చేస్తూ ఉంటాడు. ఆయన ద్వారా ఆ కంపెనీలో జాబ్ సంపాదించవచ్చని లక్ష్మణ్ కూడా సిటీకి వచ్చేస్తాడు. అక్కాబావల దగ్గర ఉంటూ 'అమ్ములు'ను చూసుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ప్రమాదం బారిన పడబోయిన ఒక వీధి కుక్కపిల్లను కాపాడి, దానిని ఇంటికి తీసుకుని వస్తాడు లక్ష్మణ్. లక్ష్మణ్ కుక్క పిల్లను తీసుకుని రావడం ఇష్టం లేకపోయినా, అనూ కారణంగా శ్రీనివాసన్ ఏమీ అనలేకపోతాడు. అందరూ కలిసి ఆ కుక్కపిల్లకి 'లక్కీ' అనే పేరు పెడతారు. లక్కీ వచ్చిన దగ్గర నుంచి 'అమ్ములు'లో మంచి మార్పు కనిపించడం మొదలుపెడుతుంది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు లేకుండా పోతుంది. లక్ష్మణ్ తో గొడవపడిన కౌన్సిలర్ గణేశ్ మూర్తి మనుషులు, 'లక్కీ'ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళతారు. మరో కుక్కపిల్ల కోసం వెదుకుతున్న లక్ష్మణ్ కీ, కీర్తి (అనశ్వర రాజన్) తారసపడుతుంది.   లక్కీ అడుగుపెట్టడమే ఆలస్యం అదృష్టం కలిసొస్తుందనే విషయం కౌన్సిలర్ కి అర్థమవుతుంది. దాంతో వెంటనే ఆ కుక్కపిల్ల ఎమ్మెల్యే ఇంటికి చేరుకుంటుంది. ఎమ్మెల్యే కి కూడా ఇదే విషయం అనుభవంలోకి వస్తుంది. ఫలితంగా ఆ కుక్కపిల్ల ముఖ్యమంత్రి ఇంటికి చేరుకుంటుంది. లక్కీపై బెంగతో అమ్ములు హాస్పిటల్ పాలవుతుంది. అమ్ములును దక్కించుకోవాలంటే, ముఖ్యమంత్రి దగ్గరున్న లక్కీని తీసుకురావలసిన బాధ్యత లక్ష్మణ్ పై పడుతుంది. అప్పుడతను ఏం చేస్తాడు? ఆ ప్రయత్నంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడు? అనేది కథ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa