ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా హెల్త్ డైట్ సీక్రెట్ ఇదే : రెజీనా కాసాండ్రా

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 04:43 PM

టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది, కేవలం లతోనే కాదు తన లైఫ్ స్టైల్ తో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. సాధారణంగా హీరోయిన్లు కార్బోహైడ్రేట్స్ కు దూరంగా ఉంటారు, కానీ ఈ భామ మాత్రం అన్నం లేకుండా ముద్ద దిగదని చెబుతోంది. ఆ గ్లామరస్ బ్యూటీ మరెవరో కాదు.. రెజీనా కాసాండ్రా. తనకు ఎలాంటి కఠినమైన నియమాలు పాటించడం నచ్చదని, కానీ శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం మాత్రం ఇష్టమని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.రెజీనాకు సౌత్ ఇండియన్ వంటకాలంటే మక్కువ ఎక్కువ. ముఖ్యంగా అన్నం లేకుండా తను ఉండలేనని చెబుతూ.. "నేను పక్కా రైస్ లవర్ ని. రోజులో కనీసం కొద్దిపాటి అన్నం అయినా తినాల్సిందే. పప్పు అన్నం, రసం అన్నం లేదా సాంబార్ సదం.. వీటిలో ఏదైనా నాకు కంఫర్ట్ ఫుడ్. ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఒక గిన్నె రసం అన్నం తింటే వచ్చే తృప్తి వేరు. దానికి తోడు ఒక చేపల వేపుడు ఉంటే చాలు.. ఇక ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే" అని రెజీనా తన ఇష్టాన్ని పంచుకున్నారు.రెజీనా డైట్‌లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె ప్రతిరోజూ 'కాంజీ'- మన వాడుకలో గంజి లేదా అన్నం జావ తాగుతారు. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ బాగుండడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె వివరిస్తారు. అప్పుడప్పుడు వెరైటీ కోసం పెస్టో పాస్తా వంటి ఇటాలియన్ వంటకాలు తిన్నా, మళ్ళీ తన మనసు దోశ లేదా అన్నం వైపే లాగుతుందని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.


ఇటీవల ఊటీలో షూటింగ్‌లో ఉన్నప్పుడు తను తిన్న ఆహారం గురించి చెబుతూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఉదయం ఐదు గుడ్ల తెల్లసొనతో చేసిన స్క్రాంబుల్డ్ ఎగ్ (కేవలం పచ్చిమిర్చి, ఉప్పుతో) తీసుకుంటారట. మధ్యాహ్నం కాంజితో పాటు డ్రై మసాలా చికెన్ తింటారు. ఒకవేళ షూటింగ్ అయిపోయి ప్రయాణంలో ఉంటే, ఊటీలోని ఫేమస్ బేకరీలో దొరికే పఫ్స్, క్యారెట్ కేక్ వంటి వాటితో కూడా అడ్జస్ట్ అయిపోతానని ఆమె తెలిపారు.లామందిలా తనకు ప్రత్యేకంగా 'చీట్ డేస్' ఉండవని రెజీనా స్పష్టం చేశారు.


 


"నేను అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తాను. ఒకవేళ ఆ రోజు పిజ్జా తినాలనిపిస్తే, అదే నా మెయిన్ మీల్ అవుతుంది. దానిపై మళ్ళీ ఇంకేదీ తినకుండా జాగ్రత్తపడతాను" అని తన ఫిట్‌నెస్ సూత్రాన్ని వివరించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa