ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల కాకముందే లాభాల్లో 'విష్ణు విన్యాసం' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 08:42 PM

యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'విష్ణు విన్యాసం' విడుదల కాకముందే లాభాల్లోకి వచ్చింది. సుమారు రూ.19 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా, థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు కలిపి రూ. 26 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. దీంతో నిర్మాతలకు రూ. 7 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa