Allu Arjun Gift Project To Friends: ఈ మధ్యకాలంలో మన చుట్టూ స్నేహానికి విలువ ఇవ్వని వారిని చూసే అవకాశం ఎక్కువ. మన సహాయం అవసరమైనప్పుడు ముఖం చాటే వాళ్లు జీవితంలో తప్పక కనిపిస్తారు.ఇలాంటి వారిలో కొంతమంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ను చూసి కూడా సిగ్గు తెచ్చుకుంటారని సోషల్ మీడియా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిన్నతనముంచి తనతో కలసి ప్రయాణం చేసిన స్నేహితులను అల్లు అర్జున్ మర్చిపోకుండా, వారికోసం చేసిన గొప్ప పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్ త్వరలో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ జూన్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది, మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మిస్తుంది.అంతే కాదు, ఈ సినిమా నిర్మాణంలో తన చిన్నతన స్నేహితులు బన్నీ వాసు, స్వాతి, నటరాజ్, సందీప్ లను కూడా భాగస్వాములుగా చేశాడు. నటరాజ్, సందీప్ స్కూల్ రోజుల నుండి అతని స్నేహితులు, స్వాతి చిన్నతననుంచి సమీప బంధువు మరియు నేస్తం. గతంలో కూడా అల్లు అర్జున్ ఇలాంటి స్నేహపరమైన సహకారాన్ని చూపాడు. ఉదాహరణకు, తన తల్లివైపు బంధువులైన ‘మొత్తంశెట్టి మీడియా’ సంస్థను ‘పుష్ప 1’ లో భాగస్వామిగా చేసాడు. ఇప్పుడు మళ్లీ అదే క్రేజీ ప్రాజెక్ట్‌లో తన చిన్నతన స్నేహితులను భాగస్వాములుగా చేసాడు.అల్లు అర్జున్ తన స్నేహితుల జీవితాలను స్థిరం చేయాలనే దృక్పథంతో, వారిని ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగం చేసారు. బన్నీ వాసు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కెరీర్ ప్రారంభం నుండి అతని సలహాదారుడిగా కొనసాగుతున్నాడు. అల్లు అర్జున్ అతని నమ్మకానికి బదులుగా, అట్లీ మూవీ లో భాగస్వామిగా, అలాగే లోకేష్ కనకరాజ్ సినిమా లో కూడా భాగస్వామి చేశాడు.ఇలాంటి స్నేహపరమైన విలువలు చాలా అరుదుగా ఉంటాయి. అప్పుడప్పుడు అల్లు అర్జున్ తన మాట తీరు వల్ల సోషల్ మీడియాలో ట్రోల్ అయినా, అతని మనసు బంగారం లాంటిది, నమ్మినవారిని కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అని మరోసారి నిరూపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa