అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'డెకాయిట్' సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. మొదట మార్చి 19న విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని, సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. 'రూబరూ' అనే కొత్త పాటను విడుదల చేసిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ పాటలో అడివి శేష్ - మృణాల్ ఠాకూర్ ల మధ్య కెమిస్ట్రీ, లిప్ లాక్ సీన్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ విలన్ గా నటిస్తుండగా ఈ సినిమా తోనే తాను టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సుప్రియ యార్లగడ్డ, సునైల్ నారంగ్ నిర్మాణం వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa