స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహరెడ్డితో కలిసి అన్యోన్యంగా ఉన్నప్పటి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లికి ముందు ఇలానే ఎంతో సరదాగా గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటున్నాడో ఏమో బన్ని. ఓపెన్ గా ఓ రెస్టారెంట్ లాంజ్ లో ఇలా అనురాగంతో ఆకట్టుకున్నారు. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే బన్నీ.. కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. భార్య స్నేహారెడ్డి.. కిడ్స్ అయాన్ – అర్హలతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట ఈ ఏడాది ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అప్పట్లో పెళ్లి ఫొటోను ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa