ఈ వేసవిలో ప్రేక్షకులను అలరించడానికి జీ తెలుగు సరికొత్త కార్యక్రమాలతో సిద్ధమైంది. సీనియర్ నటి రోజా 'ది ఫ్యామిలీ అసెంబ్లీ' అనే కొత్త షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో గాయని సమీరా భరద్వాజ్, నటి రాజ్యం కూడా కనిపించనున్నారు. ఈ షో ఏప్రిల్ 19న ప్రారంభమై, ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. ప్రారంభ ఎపిసోడ్‌లో 'మేఘసందేశం' సీరియల్ టీమ్, 'గాయపడ్డ సింహం' సినిమా ప్రమోషన్స్ కోసం ఫరియా అబ్దుల్లా, జేడీ చక్రవర్తి సందడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa