మలయాళ టీవీ నటుడు, 'వినీష్'గా సుపరిచితుడైన సిద్ధార్థ్ వేణుగోపాల్ (41) శనివారం క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన రెండేళ్లుగా చికిత్స పొందుతూ.. శనివారం నాడు మరణించారు. నటి సీమ జి నాయర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. సిద్ధార్థ్ మృతి పట్ల మలయాళ చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన అనేక టెలివిజన్ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa