బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ 'స్త్రీ-2' విజయం తర్వాత పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా, 'షార్క్ ట్యాంక్ ఇండియా' ఫేమ్ అష్నీర్ గ్రోవర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ఆమె నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ హీరోగా, శ్రద్ధా ఆయన భార్య పాత్రలో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. రాహుల్ మోడీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అష్నీర్ గ్రోవర్ 2022లో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో వార్తల్లో నిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa