టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్, సినీ పరిశ్రమలో నెపోటిజం, అవకాశాల వెనుక ఉన్న చేదు నిజాలను వెల్లడించారు. 'రాజశేఖర్ అమ్మాయి అంటే దర్శకుడి దగ్గరకు వెళ్లేందుకు ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది. కానీ, ఆ తర్వాత అవకాశం రావడం అనేది కేవలం నా ప్రతిభ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నెపోటిజం అనేది మొదటి సినిమా వరకే పనికొస్తుంది, ఆ తర్వాత ప్రతి సినిమా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది' అని ఆమె అన్నారు. 'దొరసాని' వల్ల 'రంగమార్తాండ'లో అవకాశం వచ్చిందని, తన బ్యాక్‌గ్రౌండ్ వల్ల కాదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa