టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న నాగార్జున, టబుల హిట్ కాంబినేషన్ 28 ఏళ్ల తర్వాత మళ్ళీ తెరపై కనిపించనుంది. నాగార్జున నటిస్తున్న 100వ చిత్రంలో టబు నటించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్‌లో టబు ఇప్పటికే జాయిన్ అయ్యారు. తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. కింగ్ 100, లాటరీ కింగ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa