తాను త్వరలోనే తల్లి కాబోతున్నట్లు టాలీవుడ్ నటి రెబా మోనికా జాన్ ప్రకటించారు. తన భర్త జోమోన్ జోసెఫ్‌తో కలిసి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ ఐలాండ్‌లో వెకేషన్‌లో ఉన్న ఆమె, బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'మేము ఇద్దరి నుండి ముగ్గురం కాబోతున్నాం' అని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2022 జనవరిలో వివాహం చేసుకున్న రెబా, 'సామజవరగమన' వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa