ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైన 'సైరా' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా అత్యద్భుతంగా ఉందంటూ చిరంజీవి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'ఈ బాస్ బస్టర్ కు ధన్యవాదాలు నాన్నా' అని తన తండ్రికి థ్యాంక్స్ చెప్పాడు. తన తండ్రి తనను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa