ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ సినిమాలపైన కన్నేసిన అన్నాతమ్ముళ్లు !

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2019, 12:53 PM

విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అదే.. ‘గీత గోవిందం’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన కెమిస్ట్రీ కేక పెట్టించింది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి కొనుక్కున్నారట. ఈ మేరకు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దర్శక, నిర్మాత కరణ్ జోహార్ నిర్మించనున్నారు. ఇందులో హీరోగా నటించబోయేది ఎవరో తెలుసా?. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్. ‘బియాండ్ ది క్లౌడ్స్’, ‘ధడక్’ సినిమాలతో మంచి విజయం అందుకున్న ఇషాన్ ‘గీత గోవిందం’ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. అన్నేమో ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ‘కబీర్ సింగ్’లో నటించి బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు తమ్ముడు ‘గీత గోవిందం’లో నటించనున్నాడు. మరి ఇతనికి విజయ్ దేవరకొండ లక్ కలిసొస్తుందో లేదో చూడాలి. అలా మొత్తానికి అన్నా తమ్ముళ్లు విజయ్ దేవరకొండ సినిమాలపై కన్నేశారు. ఈ మధ్యకాలంలో దర్శకుడు రోహిత్ శెట్టి తెలుగు సినిమాలను టార్గెట్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాను హిందీలో ‘సింబా’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా వసూళ్లతో దూసుకెళ్లింది. ఇప్పుడు గీత గోవిందం రీమేక్ బాధ్యతలు కూడా ఆయనే తీసుకుంటున్నారు. రోహిత్ శెట్టి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. ఆయన సినిమాల్లో యాక్షన్‌, రొమాన్స్‌కు కొదవ ఉండదు. ఈ రీమేక్‌ను కూడా ఆయన సక్సెస్‌ఫుల్ చేస్తారనే తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ శెట్టి ‘సూర్యవంశి’ సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్నారు. కాప్ డ్రామాగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రోహిత్ గీత గోవిందం రీమేక్‌పై ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa