RX 100తో తెలుగు తెరపై అందాల విందు చేసిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమా తర్వాత అమ్మడుకు పుల్ ఫాలోయింగ్ వచ్చింది. తొలి సినిమాలోనే ఛాలెంజింగ్ పాత్ర చేసి ఔరా అనిపించుకుంది పాయల్. ఇప్పుడు మరోసారి RDX లవ్ సినిమాతో వచ్చింది ఈ ముద్దుగుమ్మ. టీజర్ చూసిన తర్వాత పూర్తిగా పెద్దలకు మాత్రమే అనిపించేలా కట్ చేసారని అర్థమైంది. మరీ ముఖ్యంగా కేవలం అడల్ట్ కంటెంట్ మాత్రమే ఉండేలా టీజర్ కట్ చేసిన దర్శకుడు.. ట్రైలర్స్‌లో మాత్రం పూర్తి వేరియేషన్ చూపిస్తున్నాడు. అసలు టీజర్, ట్రైలర్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండా అద్బుతమైన స్ట్రాటజీ చూపించాడు. పాయల్‌ను కేవలం స్కిన్ షో కోసమే ఎంచుకున్నాడేమో అనేంతగా టీజర్ వస్తే.. ట్రైలర్‌లో మాత్రం ఫుల్లుగా సీరియస్ కథ చెప్పాడు. తొలి ట్రైలర్‌లోనే ఇలా చేసాడనుకుంటే ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ కూడా ఇదే చేసి చూపించాడు శంకర్ భాను. ‘RX 100’ చిత్రంలో బోల్డ్ నటనతో అందర్నీ మాయ చేసిన ఈ చిన్నది.. ఇప్పుడు మరోసారి వచ్చేస్తుంది. ఈ సారి యాక్షన్ కమ్ రొమాంటిక్ రోల్ చేస్తుంది పాయల్. హీరో మాదిరే ఈ చిత్రంలో ఫైట్లు కూడా చేసింది. RDX లవ్ ట్రైలర్ ఓ ఊరు నేపథ్యంలో సాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటస్తున్న ‘వెంకీ మామ’ సినిమాలో కూడా నటిస్తుంది పాయల్. మరోవైపు రవితేజ హీరోగా నటిస్తోన్న ‘డిస్కోరాజా’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. RDX Love సినిమాలో పాయల్ రాజ్‌పుత్ సరసన తేజస్ కంచర్ల నటించాడు. శంకర్ భాను డైరెక్ట్ చేసిన ఈ మూవీని సి.కళ్యాణ్ నిర్మించాడు. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa