బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా `సైరా`. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ గురించి టాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి తెలుగు సినీ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగిన చిరంజీవి నిజ జీవితకథ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఈ బయోపిక్‌లో చిరు తనయుడు రామ్‌చరణ్ నటిస్తే బాగుంటుందని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్న తాజాగా చిరంజీవికి ఎదురైంది. దీనికి చిరంజీవి ఆసక్తికరంగా స్పందించారు. `నా బయోపిక్‌లో రామ్‌చరణ్ నటిస్తే బాగుండదు. తను నా పాత్రలో నటిస్తే వందశాతం న్యాయం చేస్తాడనడంలో సందేహం లేదు. కానీ, కొన్ని సమస్యలున్నాయి. నా పోలికలు కొన్ని సాయిధరమ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లో ఉంటాయని సన్నిహితులు అంటుంటారు. వారెవరైనా నా పాత్రలో నటిస్తే బాగుంటుంది. నా బయోపిక్ తీస్తే నా కుటుంబానికి చెందిన హీరోలే నటించాలి. ఎందుకంటే నా పోలికలు వారిలోనే ఉంటాయ`ని చిరంజీవి వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa