రజనీకాంత్ కథానాయకుడిగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. దీంతో పాటు రజనీకాంత్ మరో షేడ్‌లోనూ కనపడబోతున్నారట. ఆ పాత్ర ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. నయనతార హీరోయిన్‌గా నటించారు. రజనీ, మురుగదాస్ కాంబినేషన్‌లో సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న రజనీకాంత్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకోనున్నాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa