ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్: పునర్నవి-రాహుల్ మధ్య చిలిపి గొడవలు

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2019, 12:49 PM

బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంట పునర్నవి-రాహుల్ మధ్య చిలిపి గొడవలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతిసారి ఏదొక గొడవ జరగడం మళ్ళీ రాసుకుని పూసుకుని తిరగడం జరుగుతుంది. శుక్రవారం ఎపిసోడ్ లో కూడా ఇద్దరి మధ్య చిన్నదానికి పెద్ద గొడవ జరిగింది. వంటగదిలో ఉన్న పునర్నవిని ఖాళీగా ఉన్నావ్ కదా సంత్రాలు వలిచిపెట్టు అని రాహుల్ మాట్లాడాడు. దీంతో పున్నూకు మండింది. అలాగే సైలెంట్ గా బయటకు వెళ్లిపోయింది. ఇక ఎప్పటిలాగానే ఆమె తోక లాగా రాహుల్ కూడా వెళ్ళి బ్రతిమలాడటం చేశాడు. రా లోపలకి వెళ్ళి మాట్లాడదాం అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్లబోయాడు. ఇక్కడే పున్నూకు ఎక్కడో మండింది. అసలు నన్ను టచ్ చేయకు...నాతో మాట్లాడకు అంటూ ఫైర్ అయింది. ఆ దెబ్బకు రాహుల్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే తర్వాత కూడా రాహుల్ బెట్టు చేశాడు. స్మోకింగ్ రూమ్ లో ఉన్న రాహుల్ ని పున్నూ మాట్లాడించే ప్రయత్నం చేసింది. రాహుల్ కూడా ముందు జరిగిన దానికి రివెంజ్ తీర్చుకోవాలనుకుని....పున్నూని తిట్టేశాడు. అసలు ‘నన్ను ఇరిటేట్ చేయకు పో.. నాకు కోపం తెప్పియ్యకు. నీ మొఖం చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. నీకు దండం తల్లి ఇక్కడ నుండి వెళ్లిపో’ అంటూ పునర్నవిపై రాహుల్ ఫైర్ అయ్యాడు. అయినా సరే  పునర్నవి మాత్రం వదలకుండా కాసేపు ఆటపట్టించింది. చివరికి మళ్ళీ వాడే వచ్చి బ్రతిమలాడుకుంటాడులే అనే ఉద్దేశంతో అక్కడ నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయింది. అయితే ఎప్పుడు వీరి మధ్య గొడవ జరగడం..మళ్ళీ కలిసిపోవడం మామూలే. గొడవ జరిగిన ఆ కాసేపు మాత్రం ఎవరికి వారు సంబంధం లేనట్టు ఉంటారు. తర్వాత మాత్రం మరి క్లోజ్ గా ఉంటారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa