కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల నిర్మాత విష్ణు ఇందూరి భారీ బడ్జెట్‌తో జయలలిత బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇక జయలలిత పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ జయలా కనిపించేందుకు కసరత్తులు ప్రారంభించారు. జయలలిత జీవితంలో కీలక పాత్ర పోషించిన ఎమ్జీఆర్ పాత్ర కోసం అరవింద్ స్వామిని ఎంపిక చేశారు. ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు.
రోజా, బొంబాయి వంటి మూవీలతో యూత్‌ను బాగా ఎంటర్‌టైన్ చేసిన హీరో అరవిందస్వామి. ఆ తరువాత విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి విజయవంతగా సినిమాల్లో దూసుకుపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa