6 అక్టోబర్ 2019 ఆదివారం ఉదయం 10.15 నిమిషాలకు తాడేపల్లిగూడెం యస్.వి.ఆర్.సర్కిల్, కె.యన్.రోడ్ లో విశ్వ నటచక్రవర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహావిష్కరణకు మెగాస్టార్ చిరంజీవి గూడెం వచ్చేస్తున్నారు. `సైరా:నరసింహారెడ్డి` ఘనవిజయం నేపథ్యంలో ప్రచారకార్యక్రమాల బిజీలోనూ మెగాస్టార్ ఇచ్చిన మాటకు కట్టుబడి విగ్రహావిష్కరణకు విచ్చేస్తున్నందుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఉదయం గన్నవరం నుంచి తాడేపల్లి చేరుకుని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అటుపై తిరిగి మెగాస్టార్ హైదరాబాద్ కి వెళ్లిపోతారని వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa