వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన "ఎఫ్2" చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. అదేంటంటే గోవాలో జరగబోయే 50వ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఏఫ్ఏఫ్ఐ) ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది. నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరగబోయే ఐఏఫ్ఏఫ్ఐ వేడుకలో 76 దేశాలకు చెందిన 250 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఈ లిస్టులో 26 ఫీచర్ ఫిలింస్, 15 నాన్ ఫీచర్ ఫిలింస్ కూడా ఉన్నాయి. కాగా.. ఈ 26 ఫీచర్ ఫిలింస్‌లో ఎంపికైన ఏకైక తెలుగు చిత్రంగా `ఎఫ్ 2` అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.ఈ వేడుకకి పది వేల మంది హాజరవుతారని ప్రభుత్వం భావిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa