ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ షోలోకి చిరంజీవి?

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2019, 01:06 PM

కింగ్ నాగార్జున.. మెగాస్టార్ చిరంజీవి స్నేహం గురించి తెలిసిందే. మా చానెల్ అధిపతులుగా ఆ ఇద్దరి స్నేహబంధం గురించి అభిమానుల్లో చాలానే ముచ్చట సాగింది. మా చానెల్ ని స్టార్ వాళ్లకు విక్రయించేశాక కూడా అందులో రకరకాల కార్యక్రమాలతో చిరు-నాగ్ కలిసి సందడి చేస్తున్నారు. ముఖ్యంగా మీలో ఎవరు కోటీశ్వరుడు?  హోస్టులుగా నాగార్జున- చిరంజీవి సందడి గురించి తెలిసిందే.  బిగ్ బాస్ -తెలుగు సీజన్ 3 హోస్ట్ గా నాగార్జున రచ్చ పీక్స్ లో ఉందిప్పుడు. ఈ షోకి పలువురు సెలబ్రిటీలు అతిధులుగా విచ్చేస్తున్నారు. కొందరు స్టార్లు తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకున్నారు. కానీ సైరా స్టార్ .. మెగాస్టార్ మాత్రం ఈ షోకి విచ్చేయలేదు ఎందుకనో. దీంతో మెగాభిమానుల్లో రకరకాల సందేహాలు .. కింగ్ నాగార్జునతో చిరు సాన్నిహిత్యం దృష్ట్యా ఈ షోలో సైరా ప్రమోషన్స్ చేయాలి కదా? అంటూ సందేహించారు. ఇంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు?  షోకి నాగార్జున హోస్టింగ్ చేసినప్పుడు చిరును అతిధిగా ఆహ్వానించారు. ఆ తర్వాత చిరు హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు?కి నాగార్జున గెస్టుగా వచ్చారు. ప్రగ్య జైశ్వాల్ తో పాటుగా నాగార్జున వెళ్లారు. ఆ క్రమంలోనే నాగార్జున హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3కి చిరు ఎందుకు రావడం లేదు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అన్ని సందేహాలకు చెక్ పెట్టేస్తూ.. తాజా సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ 3లో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. అది కూడా కింగ్ నాగార్జున అభ్యర్థన మేరకు ఈ షోకు విచ్చేయనున్నారట. వాస్తవానికి చిరు ఇప్పుడున్న బిజీలో రాలేని పరిస్థితి ఉంది. సైరా రిలీజ్ తర్వాత ప్రచారం పనుల్లో చిరు బిజీ బిజీగా ఉన్నారు. సల్మాన్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ షోలోనూ చిరు సందడి చేయబోతున్నారని వార్తలొచ్చాయి. అలాగే తెలుగు బిగ్ బాస్ కి ఎటెండవుతున్నారన్న మాటా వినిపిస్తోంది. ఈ శనివారం ఎపిసోడ్ లో చిరు కనిపించలేదు. అంటే ఆదివారం ఎపిసోడ్ లో కనిపిస్తారా? అన్నది చూడాలి. మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జున ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ కి అంతకంటే సంబరం ఇంకేం ఉంటుంది?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa