ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘నిశ్శబ్దం’ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2019, 04:08 PM

స్వీటీ అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం నిశ్శబ్దం. అనుష్క మూగదైన పెయింటింగ్ ఆర్టిస్టుగా నటిస్తుండగా ఓ వైవిధ్యమైన కథతో కళాత్మ చిత్రంగా తెరకెక్కుతోందని సమాచారం. కాగా రేపు నిశ్శబ్దం చిత్రం నుండి మాధవన్ పాత్రను, మరియు అతని లుక్ ని పరిచయం చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. వైలిన్ వాయిస్తున్నట్లు గా ఉన్న మాధవన్ సగం ఫొటోతో ఉన్న ఆ పోస్టర్ చూస్తుంటే ఆయన వైలిన్ కళాకారుడిగా కనిపిస్తారేమో అని తోస్తుంది. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల ఇతర కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసన్ ఓ పాత్ర చేయడం విశేషం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తుండగా, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa