గత కొన్నేళ్లుగా చిరంజీవి- పవన్ కల్యాణ్ .. నందమూరి క్యాంప్ కి పోటీగా రాజకీయాల్లోకి రావడంతో పొలిటికల్ వార్ కారణంగా అభిమానుల మధ్యనే కాదు స్టార్ల మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. చిరు సోదరుడు బాలయ్యపై విసిరిన విసుర్లు, విడుదల చేసిన యూట్యూబ్ ఆలాపనలు వీటికి ఆజ్యం పోసాయి. దానివల్ల ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం కాస్త దెబ్బతిందనే చెప్పాలి. ఇటీవల కాలం వరకు సైరా సినిమాపై నటసింహం ఎలాంటి వ్యాఖ్యలు చేయక పోవటంపై కాసింత గుర్రుగనే ఉంది మెగా ఫ్యాన్స్ .
హైదరాబాద్ లో జరిగిన సైరా సక్సెస్ వేడుకని జరిపిన టి. సుబ్బరామిరెడ్డి దాదాపు సినీ ప్రముఖులందరినీ ఆహ్వానించారు. దీనికి హేమాహేమీలైన వెంకటేష్, కృష్ణంరాజు తదితరులు హాజరయ్యారు. అయితే అనూహ్యంగా నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రత్యక్షమవ్వడంతో అతిధుల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. అక్కడికి విచ్చేసిన బాలయ్య సైరా టీమ్ కి శుభాకాంక్షలు చెపుతూ... మెగాస్టార్ చిరంజీవితో కరచాలనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా విషెస్ చెప్పారు.
దీంతో ఈ ఇద్దరు అగ్ర హీరోల మధ్య ఈ స్నేహం.. శుభాభివందనలే అసలైన సక్సెస్ కింద లెక్కని సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ అభిమానులు అనుకున్నట్టు వీరి మధ్య పొరపొచ్చాలు శాశ్వతాలు కాదు. కేవలం నీటి బుడగలని సీనీ జనాలు చెపుకుంటున్నారు. అదండీ సంగతి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa