మాధవి కేసాని దర్శకత్వంలో అన్వేష్, సారిక జంటగా నటిస్తున్న చిత్రం జిగేల్ రాజా. జి.ఎస్. జాషువా రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్‌నిచ్చారు. స్నిగ్ధ కెమెరా స్విచ్ఛాన్ చేయగా. శ్రీరంగ సతీష్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకులు మాధవి మాట్లాడుతూ జిగేలు రాజా పాట ఎంత ఆకట్టుకుందో, ఈ సినిమా అంతే నచ్చుతుందన్నారు. సరికొత్త లొకేషన్లలో షూటింగ్ జరిపేందుకు నిర్మాత మరింత ఉత్సాహంతో ఉన్నారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa