ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నిర్ణయంతో ఆ సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి... !

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2019, 01:11 PM

తమ అభిమాన కథానాయకుడి సినిమా థియేటర్లలో ఉన్నప్పటికీ.. చాల మంది అభిమానులు డిజిటల్‌ ఫ్లాట్‌ ఫామ్‌ లోనే ఆ సినిమాని చూసేస్తున్నారు. దాంతో సినిమాకి వచ్చే కలెక్షన్స్ తగిపోతున్నాయి. ఈ సమస్య ఎక్కువుగా ఓవర్సీస్‌ లో కనిపిస్తోంది. ఈ మధ్య అక్కడి సినిమాల కలెక్షన్లు బాగా పడిపోయాయి. అందుకే బ్లూస్కై సినిమాస్‌ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ‘అల… వైకుంఠపురములో..’ సినిమా ఓవర్సీస్‌ రైట్స్ భారీ మొత్తానికి దక్కించుకున్న బ్లూస్కై సినిమాస్‌.. ఈ సినిమా థియేటర్లలో ఉన్నంతకాలం ఆమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లో చూడలేరని ఆ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా రిలీజ్ చేసింది. ఈ నిర్ణయంతో బన్నీ సినిమా కలెక్షన్స్ పెరగనున్నాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని జనవరి 12న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి తమన్ ఇచ్చిన ట్యూన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని టాక్. బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయట. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa