ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రొమాంటిక్' మూవీ సెట్లో అగ్నిప్రమాదం...!

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2019, 01:30 PM

పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా 'రొమాంటిక్'. ఈ మధ్యే ఫస్ట్ లుక్ విడుదలైంది ఈ చిత్రానిది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటే విమర్శలు కూడా వచ్చాయి. ఇలాంటి సినిమాలు పూరీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడంటూ ఆయనకు కూడా విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ చిత్ర సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. ఇన్‌డోర్ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటుంది రొమాంటిక్ సినిమా. అలా జరుగుతున్న సమయంలోనే ముందు అక్కడున్న ఓ బట్టకు మంట అంటుకుంది. ఆ తర్వాత అంతా రాజుకుంది. యూనిట్ సభ్యులు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించినా కూడా క్లాత్ కావడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. షూటింగ్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు హీరో హీరోయిన్లు ఉన్నారా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆల్రెడీ షూటింగ్ అయిపోయిన తర్వాత అగ్నిప్రమాదం జరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ మధ్య సైరా సినిమా సమయంలో కూడా ఇదే జరిగింది. షూట్ అంతా అయిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు రొమాంటిక్ సినిమా సెట్ విషయంలో కూడా ఇదే జరిగిందేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కేతిక శర్మ నటిస్తుంది. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దీనికి దర్శకుడు. బోల్డ్‌ కంటెంట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అనిల్. ఏదేమైనా ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది రొమాంటిక్. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలిక.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa