ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలు ఎక్కువగా చేస్తూ వెళుతోన్న తాప్సీ, తాజాగా తెలుగులో 'ఆనందో బ్రహ్మ' సినిమా చేసింది. 'భయానికి నవ్వుంటే భయం' అనే ట్యాగ్ లైన్ తో హారర్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. తాప్సీ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, దర్శకుడు మహి.వి రాఘవ్ ప్రతి పాత్రను అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పారు. దెయ్యాలనే మనుషులు భయపెట్టే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిందని అన్నారు. తాప్సీ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఆగస్టు 18న విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఇక ఈ సినిమాకి ఏ స్థాయి ఆదరణ లభిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa