ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్‌కుమార్ దర్శకత్వంలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘త్రీమంకీస్’. చిత్రీకరణ పూర్తయింది. . కారుణ్యచౌదరి కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల హీరో వెంకటేష్ చేతులు మీదుగా ప్రారంభించగా ఈ చిత్ర లోగో, ఫస్ట్‌లుక్ నాగబాబు ఆవిష్కరించారు.
. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్లో సుధీర్, శ్రీను, రాంప్రసాద్ కామెడీ సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగులు, కారుణ్య చౌదరి ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇక ట్రైలర్ లో సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ కామెడీతో పాటు షకలక శంకర్ కామెడీ కూడా అదిరిపోయింది. ఇక కారుణ్య చౌదరి మొదట సాఫ్ట్ గా ఉన్న తర్వాగ ఈ ముగ్గురుని భయపెట్టే సీన్ చూస్తుంటే సినిమాలో కామెడీ తో పాటు థ్రిల్లింగ్ కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి సినిమా ఫుల్ లెన్త్ కామెడీగా ఉన్నట్లు అనిపిస్తుందని ఫిలింనగర్ నుంచి వినిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa