రాజుగారి గదికి సీక్వెల్ గా వస్తున్న రాజుగారి గది 3 రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఓంకార్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. రాజుగాది గది 3 సినిమా రీమేక్ అని క్లారిటీ ఇచ్చాడు ఓంకార్. సంతానం హీరోగా తమిళ్‌లో ఘన విజయం సాధించిన దిల్లుకు దుడ్డు 2 సినిమా మెయిన్ పాయింట్ తీసుకొని మన నేటివిటీకి తగ్గట్టుగా కథను సిద్ధం చేసుకున్నట్టుగా చెప్పాడు. మలయాళ సినిమా ప్రేతమ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన రాజుగారి గది 2 సినిమాను ముందుగా సీనియర్ హీరో వెంకటేష్‌తో చేయాలనుకున్నాడట.కానీ వెంకటేష్‌తో ప్రాజెక్ట్ సెట్ కాకపోవటంతో నాగార్జున హీరోగా తెరకెక్కించినట్టుగా చెప్పాడు. అంతేకాదు త్వరలోనే రాజుగారి గది సిరీస్‌లో వెంకటేష్ హీరోగా ఓ సినిమా ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. అంటే రాజుగాది గది 4, వెంకటేష్ హీరోగా తెరకెక్కనుందన్న మాట.ఓంకార్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన రాజుగాది గది 3 సినిమాలో అశ్విన్ బాబు, అవికా గోర్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సిరీస్‌లో వచ్చిన గతచిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో కామెడీ మరింతగా అలరిస్తుందని కాన్ఫిడెంట్‌గా చెపుతున్నాడు ఓంకార్. ఈ సినిమాలో సీనియర్ నటులు అలీ, ఉర్వశీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.నాగార్జున హీరోగా తెరకెక్కిన రాజుగారి గది 2కు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో ఈ సినిమా విషయంలో మరింత కేర్ తీసుకున్నాడు. రాజుగారి గది 2లో ఎంటర్‌టైన్మెంట్ పాల్లు తగ్గాయన్న టాక్ రావటంతో ఈ సినిమాను మరింత ఎంటర్‌టైనింగ్‌గా రూపొందించాడు ఓంకార్. ముఖ్యంగా సినిమాలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్‌లు సూపర్బ్‌గా వచ్చిందంటున్న చిత్రయూనిట్ ఆడియన్స్ కడుపుబ్బ నవ్వుకునే సినిమా వచ్చిందంటున్నారు.అంతేకాదు తన తమ్ముడిని హీరోగా నిలబెట్టడం తన బాధ్యత అన్న ఓంకార్ అందుకోసమే ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించామని వెల్లించాడు. కేవలం నాలుగు నెలలో కాలంలో సినిమాను పూర్తి చేసేందుకు సహకరించిన చిత్రయూనిట్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాజుగారి గది 3 ఆడియన్స్‌ను ఏమేరకు అలరిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa