ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్ హీరో కావాలా రష్మికా..?

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2019, 06:36 PM

దిల్ రాజు నిర్మాణంలో నాగ చైతన్య హీరోగా ఓ సినిమా త్వరలోనే మొదలు కానుంది. ఆ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనుందని జెమిని ఛానల్ కన్ఫర్మ్ చేసింది. ఎందుకంటే చైతు - రష్మిక ల సినిమా శాటిలైట్ హక్కులను మేమే సొంతం చేసుకున్నామంటూ ట్వీట్ చేసింది జెమిని ఛానల్. చైతు రీసెంట్ మూవీస్ వెంకీ మామ, శేఖర్ కమ్ముల సినిమా పూర్తి కాగానే చైతు - రష్మిక ల సినిమా పట్టాలెక్కనుందని అనుకున్నారు. అయితే తాజాగా రష్మిక, నాగ చైతన్యకి షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. తాను ఈ సినిమా చెయ్యలేనని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి డేట్స్ ప్రాబ్లమా? చిన్న హీరో అని ఆలోచించిందా? అనేది తెలియదు కానీ.. రష్మిక మాత్రం చైతు - దిల్ రాజు సినిమాలో చెయ్యడం లేదనేది ఫిలింనగర్ టాక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa