తెలుగు తెరపై అగ్రకథానాయికలుగా వెలుగొందుతోన్న వారి గ్లామర్ కి .. కేథరిన్ గ్లామర్ ఎంతమాత్రం తీసిపోదు. మత్తు కళ్లతో యూత్ ను మెప్పించడమే ఆమె ప్రత్యేకత. అలాంటి కేథరిన్ కి ఇంతవరకూ సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. ఆ మధ్య ఆమె స్పెషల్ సాంగ్ చేయడంతో, అంతా ఆ తరహా సాంగ్స్ గురించే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇక పై అలాంటి సాంగ్స్ చేయనని తాను సున్నితంగా తిరస్కరిస్తోన్నట్టు తాజాగా కేథరిన్ చెప్పింది. మరి ' జయ జానకి నాయక'లో ఎందుకు స్పెషల్ సాంగ్ చేసినట్టు? అనే ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో స్పందించింది. 'సరైనోడు'లో తనకి బోయపాటి మంచి పాత్రను ఇచ్చినందుకు కృతజ్ఞతగా చేశానని చెప్పింది. అయితే ఒక సినిమాకి ఇచ్చేంత రెమ్యునరేషన్ ఆ ఒక్క పాటకి ఇవ్వడం వల్లనే ఆమె చేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినబడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa