ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపావళికి 'సరిలేరు నీకెవ్వరు' మూవీ నుంచి విజయశాంతి ఫస్టులుక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2019, 03:26 PM

అందం .. అభినయం కలగలిసిన నిన్నటితరం కథానాయికలలో విజయశాంతి ఒకరు. 2006లో 'నాయుడమ్మ' సినిమా తరువాత విజయశాంతి రాజకీయాలలో బిజీ అయ్యారు. ఆ కారణంగా ఆమె సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. మళ్లీ ఇంతకాలానికి .. అంటే 13 ఏళ్ల తరువాత ఆమె 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆమె రాయలసీమకి చెందిన పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి విజయశాంతి లుక్ ఎలా వుండనుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ రోజున ఆమె ఫస్టులుక్ ను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. మహేశ్ బాబు .. రష్మిక జంటగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa